ట్రాఫిక్‌లో చిక్కుకున్న మంత్రి.. ఏం చేశారంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాఫిక్‌లో చిక్కుకున్న మంత్రి.. ఏం చేశారంటే..

September 11, 2019

సాధారణంగా మంత్రి కాన్వాయ్ వస్తుందంటే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా పోలీసులు చూసుకుంటారు. మంత్రుల కాన్వాయ్ వెళ్లేందుకు కొన్నిసార్లు సామాన్యుల వాహనాలు ఆపి మరి పంపించేస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన మంత్రి మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. తాను వెళ్తున్న రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆయనే స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేయించారు. 

ఇండోర్‌లో మంగళవారం రాత్రి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఆ సమయంలోనే అటుగా వచ్చిన ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి జితూ పట్వారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఆయనే స్వయంగా కారు దిగి వాహనదారులను ముందుకు కదలమంటూ చెప్పాడు.ట్రాఫిక్‌ను క్లియర్‌  చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూశారు. అంతా సర్థుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.