అతని వయస్సు 50 సంవత్సరాలు ,కానీ ఎత్తు మాత్రం 29 ఇంచులు మాత్రమే..అతనే బసోరి లాయ్, ఉండేది మద్యప్రదేశ్ రాష్ట్రంలో,పుట్టినప్పుడు అందరి పిల్లలలెక్కనే మామూలుగానే ఉన్నాడట..కానీ అతనికి 5 ఏండ్లు వచ్చేసరికి ఎదుగుదల ఆగిపోయిందట, వయసు పెరుగింది కానీ ఎత్తుమాత్రం 29 ఇంచులకే పరిమితం అయ్యిందట,ఊర్లో ఉన్న డాక్టర్లకు చూపిస్తే బసోరికున్న ప్రాబ్లం ఏంటో అర్ధంకాని పరిస్ధితి,ఎవరైనా స్పెషలిస్ట్ కు చూపిద్దామన్కుంటే అసలే బీదకుటుంబం ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్ధితి.
అతనికి ఒక అన్నకూడా ఉన్నాడు అతను అందరిలాగే మామూలు హైటే,బన్సోరి చూడడానికి చిన్నగా కనిపిస్తున్న ఆ గ్రామంలో అతనో పెద్ద సెలబ్రీటీ అయిపోయాడు,అందరూ అతనితో ఫోటోలు దిగడానికి పోటీ పడతారట,చిన్న పిల్లలు అతని చుట్టూ చేరి..ఎంచక్కా ఆడుకుంటారట,గ్రామస్తులు అందరూ అతన్ని బుజ్జి ఏలియన్ అని ముద్దుగా పిలుస్తారట.బన్సోరి ఒక ఫ్యాక్టరీలు పనిచేస్తూ దేవుడు తనకిచ్చిన ఈలైఫ్ ని ఎంజాయ్ చేస్తు గడిపేస్తున్నాడట,అతను హైట్ లో తక్కో కావచ్చు కానీ గుణంలో… మంచి మనసులో అందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నాడు అని చెప్తున్నారు అక్కడి గ్రామస్తులు.