పీవీ ఫ్లైఓవర్‌పై పిచ్చివాడి రచ్చ..  మోదీ కారు ఇస్తాడని..  - MicTv.in - Telugu News
mictv telugu

పీవీ ఫ్లైఓవర్‌పై పిచ్చివాడి రచ్చ..  మోదీ కారు ఇస్తాడని.. 

July 18, 2019

Madman on pv flyover .......

హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై ఈ రోజు ఉదయం మతిస్థిమితం లేని యువకుడు కలకలం రేపాడు. వాహనాల రాకపోకలతో రద్దీ ఉన్న ఫ్లైఓవర్‌పై అత్తాపూర్ 125వ పిల్లర్ వద్ద గోడ ఎక్కి భయపెట్టాడు. కార్లలో వెళ్తున్న జనం అతణ్ని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. చివరకు ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి అతణ్ని లాక్కెళ్లారు. తమ బైక్‌పై తీసుకెళ్లి తల్లిదండ్రులకు విషయం చేరవేశారు. దూకేస్తానని బెదరిస్తున్నప్పుడు ఆ యువకుడు పిచ్చిపిచ్చిగా మాట్లాడినట్లు సాక్షులు చెప్పారు. ఏదైనా ఘనకార్యం చేస్తే స్కార్పియో కారు ఇస్తానని మోదీ చెప్పినట్లు వార్తల్లో చదివానని, అందుకే ఈ సాహసం చేస్తున్నానని అతడు అన్నట్లు చెప్పారు. తనకు పెళ్లయిందని ఒకసారి, కాలేదని ఒకసారి పొంతన లేకుండా మాట్లాడారని తెలిపారు.