జయలలిత ఆస్తులు వాళ్లిద్దిరికే..హైకోర్టు సంచలన తీర్పు - MicTv.in - Telugu News
mictv telugu

జయలలిత ఆస్తులు వాళ్లిద్దిరికే..హైకోర్టు సంచలన తీర్పు

May 27, 2020

 

Jayalalithaa

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అన్నాడీఎంకే నేత పుహలేంది వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు రూ. 913 కోట్ల విలువైన జయలలిత ఆస్తులు ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ లకు చెందుతాయని ప్రకటించింది. జయలలిత పెళ్లి చేసుకోక పోవడంతో ఆమెకు దీప, దీపక్ తప్ప మరెవరూ చట్టబద్ధమైన వారసులు లేరని కోర్టు వ్యాఖ్యానించింది.

అలాగే పోయస్ గార్డెన్ లో ఉన్న జయ నివాసమైన ‘వేద నిలయం’ బంగ్లాను రాష్ట్ర ప్రభుత్వం మెమోరియల్ స్మారక మ్యూజియంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెల్సిందే. దీనిపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వేదనిలయంలో సగభాగాన్ని సీఎం కార్యాలయంగా, మిగిలిన సగభాగాన్ని ఆమె స్మారక మ్యూజియంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తమ సూచనలపై సమాధానం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు నెలల గడువు ఇచ్చింది. వేద నిలయం విలువ రూ. 100 కోట్లకు పైగానే ఉంటుందని… అందువల్ల జయ వారసులకు కూడా దీని విషయంలో నోటీసులు ఇవ్వాలని, వారి వాదనలను కూడా వినాలని తెలిపింది.