రజినీకి హైకోర్టు షాక్.. పన్ను విషయంలో - MicTv.in - Telugu News
mictv telugu

రజినీకి హైకోర్టు షాక్.. పన్ను విషయంలో

October 14, 2020

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. చెన్నైలో రజినీకాంత్ కి రాఘవేంద్ర కల్యాణమంటపం ఉంది. దానిపై ఉన్న రూ. 6.5 లక్షల ఆస్తి పన్ను ఉంది. దానిని చెల్లించాలంటూ కార్పొరేషన్ అధికారులు రజినీకి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై రజనీకాంత్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. లాక్ డౌన్ లో కల్యాణమంటపాన్ని మూసి ఉంచామని కోర్టుకు తెలిపారు. 

లాక్ డౌన్ కాలంలో కల్యాణపంటపం నుంచి ఎలాంటి ఆదాయం రాలేదని, కార్పొరేషన్ విధించిన పన్నును తాను చెల్లించలేనని మద్రాస్ హైకోర్టులో రజనీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై జస్టిస్ అనిత సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో కేసును ఉపసంహరించుకోవడానికి కాస్త సమయం కావాలని రజినీకాంత్ తరపు లాయర్ కోర్టుని కోరాడు.