Maha Shivarathri 2023: Telugu movies to watch during your Jaagaram this Maha Shivarathri
mictv telugu

Maha Shivarathri 2023 : శివయ్య దర్శనం చేయించిన తెలుగు సినిమాలు

February 17, 2023

Maha Shivarathri 2023: Telugu movies to watch during your Jaagaram this Maha Shivarathri

శివుడు విలక్షణ దైవం. ఆయన భక్త సులభుడు. కోరిందే తడవుగా వరాలను ప్రసాదించే దైవం. అందుకే ఆయనను భోళాశంకరుడు అన్నారు. ఆడంబరాలకు ఆయన దూరం. ఓ చెంబుడు జలంతో అభిషేకం చేసి.. మారేడు పత్రాలతో పూజచేస్తే పరవశించి పోతాడాయన. నిరాడంబరుడైన పరమశివుని తత్త్వం మాత్రం మాహాద్భుతం. బ్రహ్మదేవుని లలాటం నుంచి జన్మించిన శివుడు లయకారకుడు. ఈ లయకారుడి మహాలింగోద్భవం జరిగిన రోజే శివరాత్రి. ప్రతి యేటా మాఘ బహుళ చతుర్థుతి రోజున శివరాత్రి జరుపుకోవడం హిందువుల సంప్రదాయం.

మహా దేవునిపై తెలుగులో చాలా చిత్రాలే వచ్చాయి. చాలా మటుకు మన అగ్ర హీరోలు.. మహా దేవుని వేషం వేసి మెప్పించారు. అలే శివుని మీద కూడా చాలానే సినిమాలు వచ్చాయి. అయితే అన్నింటికన్నా ముందు చెప్పుకోవలసింది మాత్రం కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ యాక్ట్ చేసిన తెలుగు సినిమా శ్రీకాళ మహిత్యం గురించి. 1940లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. రాజ్ కుమార్ అద్భుతంగా నటించిన సినిమాల్లో ఇది ఒకటి. శివుని భక్తుడు అయిన కన్నప్ప జీవిత చరిత్రే ఈ మూవీ. ఇందులో పాటలు కూడా సూపర్ హిట్. పూర్వం ఈ సినిమా పాటలు మోగని గుడి ఉండేది కాదు. అలాగే ప్రతీ శివరాత్రి ఈటీవీ, డీడీ లల్లాంటి వాటిల్లో ీ సినిమా తప్పనిసరిగా వస్తూనే ఉంటుంది.

తరువాత తెలుగులో శివుని సినిమాలు గురించి చెప్పుకోవాలంటే మన ఎన్టీయార్ సినిమాల గురించే చెప్పుకోవాలి. ఎన్టీయార్ శివుడిగా టనించిన సినిమాలు రెండు ఉన్నాయి. ఒకటి దక్షయజ్ఞం, రెండు ఉమచండీగౌరీ మహత్యం. 1962లో తెరకెక్కిన ‘దక్షయజ్ఞం చిత్రాన్ని కడారు నాగభూషణం స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. ప్రతి శివరాత్రికి ఏదో ఒక తెలుగు ఛానెల్‌లో ఈ సినిమాను తప్పక ప్రదర్శిస్తూ ఉంటారు. అటు విజయ ప్రొడక్షన్స్‌లో 1968లో వచ్చిన ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ సినిమాలో కూడా మహా శివుడి వేషంలో మెప్పించారు. ఈ రెండు సినిమాలు చేసినపుడు ఎన్టీఆర్ ఇంట్లో కీడు జరగడంతో ఆ తర్వాత శివుడి పాత్రలు ఏ సినిమాలు చేయలేదు అని చెబుతారు. వీటితో పాటు భూకైలాస్, సీతారామ కల్యాణం సినిమాల గురించి కూడా చెప్పుకోవాలి. నిజానికి ఈ రెండు రావణుడి కథలు సినిమాగా తీసారు. అయితే రావణుడు అపర శివభక్తుడు. కాబట్టి వీటిల్లో మొత్తం శివభక్తి ఉంటుంది. అందుకే శివరాత్రి రోజున చాలా మంది తప్పనిసరిగా ఈ రెండు సినిమాలు కూడా చూస్తారు.

కృష్ణంరాజు వినాయక విజయం సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమ శివుని వేషంలో మెప్పించారు. ఈ సినిమా ఎపుడు వినాయక చవితి వస్తే.. ఈ సినిమాను శాటిలైట్‌ ఛానెల్‌లో ప్రదర్శిస్తూ ఉంటారు. వినాయకుడి జీవిత చరిత్రపై తెరకెక్కిన ఈ చిత్రంలో శివ లీలలను బాగానే చూపించారు.కమలకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణంరాజు శివుడిగా మెప్పిస్తే.. వాణిశ్రీ పార్వతి దేవి పాత్రలో అలరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో పాటూ కృష్ణంరాజు భక్త కన్నప్ప అనే సినిమా కూడా చేశారు. కన్నడ రాజ్ కుమార్ చేసిన సినిమానే మళ్ళీ కృష్ణంరాజు, వాణిశ్రీ ఇంకా కొంత అప్పటి నటులతో కొత్తగా తీసారు. భక్త కన్నప్ప సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటుడు బాలయ్య శివుడిగా నటించారు.

దీని తరువాత శివుని మీద పెద్దగా సినిమాలు రాలేదనే చెప్పుకోవాలి. తరువాత కాలం మారిపోయింది. పురాణాల సినిమాలు తగ్గిపోయాయి. దేవుడి సినిమాలు వచ్చినా అవన్నీ అమ్మవార్ల సినిమాలు అయ్యాయి. కానీ చాలా కాలం తర్వాత పూర్తి శివుడు, శివ భక్తుడి సినిమాగా వచ్చింది మాత్రం మంజునాథ. ఇందులో మెగాస్టార్ట్ చిరంజీవి శివునిగా, మీనా పార్వతి గా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ శివభక్తుడు మంజునాథగా మెప్పించారు. ఈ సినిమా మళ్ళీ పెద్ద హిట్ అయింది. పాటలు కూడా చాలా పాపులర్ అయ్యాయి. శివరాత్రి వచ్చిందంటే ఈ సినిమా కూడా కచ్చితంగా చూస్తారు జనాలు.

తర్వాత మళ్ళీ శివుడున్నాడు అంటూ వచ్చిన ఫాంటసీ సినిమా నాగార్జున హీరోగా నటించిన ఢమరుకం మూవీ. ఇందులో ప్రకాష్ రాజ్ శివుడిగా కనిపిస్తారు. అయితే ఇది పురాణ కథ కాదు. ఒక ఫాంటసీ సినిమా. కుద్ర పూజలు, రాక్షసుడిలాంటి వాడు ఒకడు, వాడిని హీరో ఎదుర్కోవడం, హీరోకి శివుడు హెల్స్ చేయడం ఇలా ఉంటుంది కథ. అందుకే ఇదొక భక్తి సినిమాగా జనాల్లో నోట్ అవ్వలేదు.

అయితే శివుడి సినిమాలు అని కాకపోయినా…తెలుగులో చాలా మంది అగ్ర నటులు శివునిగా మాత్రం నటించారు. ఎన్టీయార్ గురించి అందరికీ తెలిసిందే. ఇక అక్కినేని విషయానికి వస్తే శివుడిగా పౌరాణిక సినిమా చేయకపోయినా.. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన మూగ మనసులు సినిమాలోని గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాటలోని రెండు మూడు సన్నివేశాల్లో శివుడిగా కనిపించి మెప్పించారు. తరువాత నట భూషణ శోభన్ బాబు కూడా ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘పరమానందయ్య శిష్యుల కథ’ సినిమాలో శివుడి పాత్రలో నటించి మెప్పించారు.ఎన్టీఆర్ హీరోగా నటించిన మాయా మశ్చీంద్ర సినిమాలో పరమ శివుడి పాత్రలో మెప్పించారు సీనియర్ హీరో రామకృష్ణ. కృష్ణ హీరోగా నటించిన ‘ఏకలవ్య’ చిత్రంలో రంగనాథ్ మహా దేవుని వేషంలో మెప్పించారు. ఈయన పలు చిత్రాల్లో మహా శివుడి వేషంలో మెప్పించడం విశేషం. చిరంజీవి విషయానికి వస్తే మంజునాథలో శివునిగా కనిపించారు. అంతకు ముందు ఆపద్భాందవుడు, పార్వతి పరమేశ్వరులు అనే సినిమాల్లో శివుడిగా కాసేపు మెరిసారు. నాగార్జున అక్కినేని కూడా భారవి దర్శకత్వంలో తెరకెక్కిన జగద్గురు ఆది శంకర చిత్రంలో నాగార్జున శివుడి పాత్రలో చండాలుడు పాత్రలో కాసేపు కనిపించారు.

తెలుగులో ఒకప్పుడు విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రావు గోపాల్ రావు మావూళ్లో మహాశివుడు సినిమాలో మహాశివుడుగా మెప్పించారు.తెలుగులో నటుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాగ భూషణం ‘భూకైలాస్‌’, ‘ఉమా సుందరి’, ‘నాగుల చవితి’ సినిమాల్లో శంకరుడిగా నటించి నాగభూషణం అనే సార్థక నామధేయుడనిపించుకున్నారు. టాలీవుడ్‌లో ఒకప్పుడు విలన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజనాల ‘ఉషా పరిణయం’ వంటి ఒకటి రెండు సినిమాల్లో పరమ శివుడిగా మెప్పించారు.