త్రిమూర్తుల్లో.. లయకారుడు శివుడు. కొలిచినంతే కోర్కెలు తీర్చే పరమేశ్వరుడు. లింగాకారంలోనూ, ప్రతిమ రూపంలోనూ పూజించే ఏకైక దేవుడు. మరి మన దేశంలో శివుడి విగ్రహాలు చాలా ఉన్నాయి. అందులో ఒక 10 మీకోసం..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శివుని విగ్రహాలు భారతదేశంలో ఉన్నాయి. వాటిని సందర్శించడం గొప్ప అనుభవం! వివిధ పరిమాణాల్లో, వివిధ ఆకారాల్లో, వివిధ భంగిమల్లో ఈ శివుని విగ్రహాలు కొలువై ఉన్నాయి. సృజనాత్మకతతో కూడిన భక్తికి చక్కటి ఉదాహరణ భారతదేశంలోని ఎత్తయిన శివుని విగ్రహాల శ్రేణి అంటే అతిశయోక్తి కాదేమో!
1. నాథద్వార శివ విగ్రహం – 251 అడుగులు – రాజస్థాన్
2. మృదేశ్వర – 123 అడుగులు – కర్ణాటక
3. ఆదియోగి – 112 అడుగులు – కోయంబత్తూరు, తమిళనాడు
4. నామ్చి – 108 అడుగులు – సిద్ధేశ్వర్ ధామ్, సిక్కిం
5. హర్ కి పౌరి శివ – 101.1 అడుగులు – హరిద్వార్, ఉత్తరాఖండ్
6. మంగళ్ మహాదేవ్ – 101 అడుగులు – హర్యానా
7. శివగిరి – 85 అడుగులు – బీజాపూర్, కర్ణాటక
8. నాగేశ్వర శివ – 82 అడుగులు – ద్వారక, గుజరాత్
9. మీనీంద్రనాథ స్వామి – 81 అడుగులు – కీరమంగళం, తమిళనాడు
10. శివ – 76 అడుగులు – జబల్పూర్, మధ్యప్రదేశ్