భోళాశంకరుడిని మనం కోరిక కోరడమే ఆలస్యం…అనుగ్రహించి అభయమిస్తారు. కష్టాలను నెరవేర్చుతారు. ఓం నమ:శివాయ అని జపించి మనస్పూర్తిగా పరమిశివున్ని ఆరాధిస్తే…ఆ శివయ్య అనుగ్రహం ఎల్లవేళల మనకు అండగా ఉంటుంది. శివపూజకు హంగులు ఆర్భాటాలు అవసరం ఉండదు. మనస్పూర్తిగా ధ్యానిస్తే చాలు. భక్తులకు కోరిన కోరికలు నెరవేర్చడంలో భక్త సులభుడు శివయ్యే. సోమవారం పరమశివుడికి ఎంతో ప్రత్యేకమైన రోజు. ప్రతినెల అమావాస్య ముందు రోజును మాసశివరాత్రి వస్తుంది. ఇక మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు మహా శివరాత్రిని జరుపుకుంటాం. ఈరోజున భక్తులు ఉపవాసం ఉంటారు. ఈ సందర్భంగా కొన్ని అనుకోని తప్పులు చేస్తుంటాం. ముఖ్యంగా శివుని ఆరాధన సందర్భంగా మనం చేయకూడని కొన్ని తప్పులు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం.
– మాఘబహుళ చతుర్దశీ రోజున వచ్చే మహాశివరాత్రి నాడు శివారాధన చేసే భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం పూర్తి చేసి శుభ్రమైన దస్తువులు ధరించాలి.
–ఉపవాసం ఉండేవాళ్లు రాత్రి నక్షత్ర దర్శనం తర్వాతే ఉపవాసం వదలాలి. మూడుపూటల్లో ఏదొకసారి కోరిక కోరికలు నెరవేరుతాయి. ఉపవాసం మధ్యలో పాలు, పండ్లు తీసుకోవచ్చు.
మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నప్పుడు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి. శివుడి పూజలో క్షీరాభిషేకం చేస్తాం. పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని ఎట్టిపరిస్థితుల్లో వాడకూడు. రాగిపాత్రలో పాలు పోయడం వల్ల అవి విషంగా మారుతాయి. స్టీలు పాత్ర లేదంటే…మట్టి పాత్రలో పాలను పోసి అభిషేకం చేయాలి. ఇక పూజసమయంలో శివుడిపై పాలు, పెరుగు, తేనె నెయ్యి, చక్కెర లాంటి పంచామృతాభిషేకాల తర్వాత నీళ్లతో చల్లి అభిషేకం చేయాలి. ఇలా చేస్తే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. అభిషేకం తర్వాత చందనంతో తిలక దిద్దాలి. ఎట్టి పరిస్థితుల్లో సింధూర తిలకం పెట్టకూడదు. శివుడికి పూర్తి ప్రదక్షిణలు చేయకూడదు. సానవట్టం నుంచి తిరిగి వెనక్కి వెళ్లి ప్రదక్షిణలు చేయాలి. శిరాత్రి రోజు ఇలాంటి నియమాలు పాటిస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది.