‘హర హర మహాదేవ.. శంభో శంకర’ అన్న వెంటనే భక్తులను అనుగ్రహిస్తాడు భోళా శంకరుడు. పూజ చేసిన వారందరికీ తగిన ప్రతిఫలం లభిస్తుంది. కానీ ఈ రాశుల వారికి మాత్రం కొద్దిగా ఎక్కువ దీవెనలు పొందుతారని పండితులు చెబుతున్నారు.
మహాశివరాత్రి.. అత్యంత పవిత్రమైన రోజు. భారతదేశంలోనే కాదు, విదేశాల్లోని హిందువులు ఈ రోజును ఉపవాస, జాగారణలతో గడుపుతారు. భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శివ నామ జపం చేస్తుంటారు. ఈ రోజున శివుడు ఎవరినీ నిరాశపరుచడు. కానీ 12 రాశాల్లో.. ప్రత్యేక దీవెనలను ఈ 6 రాశుల వారికి అందిస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది. ఆ రాశులేవో చదువండి.
కుంభం :
ఈ మహాశివరాత్రి వీరు ఏ పనైనా మొదలు పెడితే దాంట్లో తప్పక విజయం సాధిస్తారు. వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు. కాబట్టి కష్టపడి పని చేసేవారికి తగిన ఫలితం, ప్రయోజనం ఉంటుంది. అవకాశాల కోసం ఎదురుచూసేవారికి అనుకూలమైన కాలం నడుస్తున్నది.
ధనుస్సు :
ఈ రాశి వారు.. శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే కలలు, కోరికలన్నీ నెరవేరుతాయి. మీ కెరీర్ లో కొత్త అఛీవ్ మెంట్స్ చేస్తారు. కష్టపడి పని చేసే వ్యక్తులకు ప్రశంసలు దక్కుతాయి.
మేషం :
మేష రాశి వారు మీ ఆదాయంలో పెరుగదలను చూడవచ్చు. శివుడి ఆశీస్సుల వల్ల.. రచయితలకు, సంపాదకీయం చేయాలనుకునే వారికి ఉద్యోగాలు దొరుకుతాయి. ఇవనే కాదు.. కోరుకునే తగిన ఉద్యోగం తప్పక దొరుకుతుంది.
మిథునం :
మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలనుకుంటే ఈ రోజు శివపూజ చేయండి. దీనివల్ల మీరు పడుతున్న బాధల నుంచి ఉపశమనం పొందొచ్చు. కెరీర్, వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది.
వృషభం :
చాలాకాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఈ రాశికి చెందిన వారికి ఎట్టకేలకు దాన్నిపొందుతారు. సీనియర్ల నుంచి మద్దతు కూడా అందుతుంది. ఆస్తి, వాహనాలపై పెట్టుబడి పెడితే కలిసి వస్తుంది.
తుల :
శివుని దయ వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆర్థిక లాభాలు కలిగి ఆనందంగా ఈ సంవత్సరాన్ని గడుపుతారు.