శివుడాజ్ఞ లేనిదే చీమనై కుట్టదంటారు. మరి ఆ శివుని దయ ఉండాలంటే ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. మహాశివరాత్రి పర్వదినాన ఏ రాశి వారు ఎలా పూజ చేయాలో తెలుసుకోండి.ఫాల్గుణ మాసం.. కృష్ణ పక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు. ఈ రోజున శివలింగాన్ని పూజించడానికి పెద్ద సంఖ్యలో ఆలయానికి ఇప్పటికే చేరుకొని ఉంటారు. అయితే మీ రాశి ప్రకారం శివుడిని ఎలా పూజించాలి. ఏం మంత్రం చదువాలో కింద చదువండి.
మేషం :
ఈ రోజున ఈ రాశి వారు.. పాలు, తేనె, ఎర్రటి పువ్వులతో చందనం సమర్పించాలి. వీరు ‘నాగేశ్వరాయ నమ:’ అని జపించాలి.
వృషభం :
శివునికి పెరుగు, మల్లెపూలు, బిల్వ ఆకులను సమర్పించాలి. వీరు తప్పనిసరిగా రుద్రాష్టకం పఠించాలి. ఇది వ్యాపారం, వృత్తిలో శ్రేయస్సును తెస్తుంది.
మిథునం :
శివునికి చెరుకు రసం, దాతుర పుష్పాలని సమర్పించాలి. విజయం సాధించడానికి ‘ఓం నమ: శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.
కర్కాటకం :
భాంగ్ తో శివున్ని అభిషేకం చేయండి. ఆరోగ్య సమస్యలను నివారించడానికి రుద్రాష్టాధ్యాయి చదవండి. విద్యలో విజయం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు అంజూరపు పుష్పాలు (ఫిగ్ పువ్వులు) సమర్పించాలి.
సింహం :
సింహరాశి వారు గంధం, నీరు, ఎర్రటి కనెర్ పుష్పాలను సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా రాజకీయ వృత్తిని, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. మీ సమస్యలన్నీ తొలగిపోవడానికి శివ చాలీసాను పఠించాలి.
కన్య:
శివ ప్రసన్నం కోసం.. బిల్వ పత్రాలను సమర్పించాలి. మహాశివరాత్రి సందర్భంగా పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. ఇంట్లో సమస్యలు వేధిస్తున్నట్లయితే.. భాంగ్ తో శివుడిని అభిషేకిస్తే అంతా మంచే జరుగుతుంది.
తుల :
విద్యారంగంలో ఉన్నవారు శివునికి నెయ్యి, పాలు, కుంకుమతో అభిషేకించండి. మిఠాయిలు సమర్పించండి. సువాసనగల నూనెతో విగ్రహాన్ని అభిషేకం చేయండి. ఈరోజు శివ సహ్రనామ స్తోత్రాన్ని పఠించండి.
వృశ్చికం
ఈ రాశి వారు వ్యక్తులు తప్పనిసరిగా తేనె, చక్కెర, గులాబీ పువ్వులు, బిల్వ చెట్టు వేర్లు కలిపిన నీటిని స్వామికి సమర్పించాలి. ఈ రోజున రుద్రాష్టకం జపించండి.
ధనుస్సు :
విజయాన్ని అందుకోవాలంటే కుంకుమపువ్వు, పచ్చని పూలతో, ఖీర్ తో రుద్రునికి అభిషేకం చేయాలి. ఈరోజున అందరూ.. ముఖ్యంగా సంతానం కోరుకునే వారు శివ పంచాక్షరి స్తోత్రం పఠించండి.
మకరం :
పార్వతీనాథాయ నమ: అనే మంత్రాన్ని జపించాలి. దాతుర పుష్పాలతో పాటు, నువ్వుల నూనె, బిల్వ పత్రాలను సమర్పించి భగవంతుని అనుగ్రహాన్ని పొందండి.
కుంభం :
మంచి అవకాశాల కోసం శివాష్టకం పఠించాలి. కొబ్బరినీళ్లు, చెరుకు రసం, ఆవాల నూనెను స్వామికి సమర్పించాలి. సంతానం కావాలనుకునే వారు కచ్చితంగా ఇవి చేయండి.
మీనం :
శివ పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు చెప్పండి. కుంకుమపువ్వు, పంచామృతం, పెరుగు, పాలు, పచ్చని పూలు, నీటితో భగవంతునికి సమర్పించాలి.