శివుడు మూడు కన్నుల కారణంగా.. త్రిలోచనుడు, త్రినేత్రుడు అని పిలిపించుకున్నాడు. అయితే ఈ మూడవ కన్ను గురించి ఒక ఆస్తకిరమైన కథలు ఉన్నాయి. అందులో ఒకటి మీకోసం..
దేవతల రాజు.. ఇంద్రుడు, అసురుల రాజు హిరణ్యకశపుడు, రాక్షసుల రాజు రావణుడు కూడా ఆయన భక్తులే. అందుకే అతను మహాదేవుడయ్యాడు. శివయ్యకు సంబంధించిన కథలు అనేకం శివపురాణంలో ఉదహరించబడ్డాయి. అయితే మూడవ కన్ను ఎలా పొందాడనే దానిమీద ఒక ఆసక్తికరమైన కథ ఇది.
మూడవ కన్ను..
శివుడు ఒక రోజు ధ్యానంలో ఉన్నాడు. ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనతో ఆటలాడాలని పార్వతి ఆలోచించింది. వెంటనే వెళ్లి ఆమె తన రెండు చేతులతో కళ్లను మూసేసింది. శివుడు ఎడమ కన్ను చంద్రుడిని, అతడి కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది. అతని మూసిన కన్నుల కారణంగా ప్రపంచం గందరగోళం లో పడిపోయింది. శివుడు వెంటనే తన నుదుటిపై మూడవ కన్ను ఏర్పడడానికి అగ్నిని ఉత్పత్తి చేయడానికి తన దైవిక సామర్థ్యాన్ని ఉపయోగించాడు. మంటల వేడికి పార్వతీ దేవి శక్తులు చెమటతో కలిపి వారి కుమారైడన అంధక సృష్టికి దారితీశాయి.
పురాణాల ప్రకారం..
శివుడు తన మూడవ కన్నును కామదేవుడిని కాల్చడానికి ఉపయోగించాడు. కాముడు ఒక చెట్టు వెనుక ఉండి శివుని హృదయంలో కామ బాణం వేశాడు. శివ కొంచెం కంగారు పడ్డాడు. ఆ దేవుడిని బూడిద చేయడానికి అతను తన మండుతన్నమూడవ కన్ను తెరిచాడు.
శివుడిని పూజించే వారికి మహాశివరాత్రి చాలా ముఖ్యమైన పర్వదినం. ఈ రోజున శివునికి ఉపవాసం చేసి పూజ చేస్తారు. ఈ రోజున శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. ఈ పర్వదినం రోజున ఆ మహాశివుడుని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన కృపకు పాత్రులుకండి.