Maha Shivratri 2023: Offer These Flowers To Lord Shiva And Seek His Blessings   
mictv telugu

పరమశివునికి ఇష్టమైన పూలను సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు!

February 17, 2023

Maha Shivratri 2023: Offer These Flowers To Lord Shiva And Seek His Blessings   

శివుడిని ప్రధానంగా రెండు రూపాల్లో జీవిస్తారు. పూజలో మొదటి రూపం శివలింగం. ఆ లింగారాధన అత్యంత పవిత్రమైనదిగా నమ్ముతారు. మరి ఆ శివయ్యకు భక్తితో నీళ్లు పోసినా కూడా కరుణిస్తాడు. కానీ ఈ పూలను సమర్పిస్తే మరింత శివుడు కరుణిస్తాడని అంటారు. శివపూజకు వేళయేరా అంటూ అందరూ పాడుకుంటుంటారు. అయితే ఆ శివరాధనకు ఇష్టమైన పూలన భక్తితో సమర్పిస్తే ఆ భోళాశంకరుడు తొందరగా అనుగ్రహిస్తాడు. శివలింగ సృష్టి విశ్వశక్తికి ప్రతీక. శివరాధన.. శివపార్వతుల కలయికను సూచిస్తుంది.

మందార :


శివునికి సమర్పించే పూలల్లో మందార ఒకటి. దీన్ని పవిత్రమైన పువ్వుగా పరిగణిస్తారు. ఈ పువ్వులను శివునికి అర్పించడం వల్ల.. శ్రేయస్సు, సంపద, బలం, సానుకూలత, ఆనందం లభిస్తాయని నమ్ముతారు.

దాతురా పువ్వులు :

ఇది.. సోలనేసి కుటుంబానికి చెందినది. విషపూరితమైన వెస్పెర్టైన్ పుష్పించే మొక్కల జాతి. వీటిని దాతురాస్ అనే కాదు.. డెవిల్స్ ట్రంపెట్స్ అని కూడా పిలుస్తారు. ఈ పూలకు మరిన్ని పేర్లు కూడా ఉన్నాయనుకోండి. ఈ పూలతో పూజిస్తే మానసిక సమస్యలు దరిచేరవు.

పారిజాతం :

హిందూ పురాణాల ప్రకారం.. దైవ పుష్పంగా పరిగణిస్తారు. విష్ణువు అవతారాల్లో ఒక్కటైన శ్రీరామునికి ఇష్టమైన పుష్పం. అయితే శివునికి కూడా ఈ పువ్వులను సమర్పించవచ్చు. శివునికి సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత, దృఢ సంకల్పం, శ్రేయస్సు, ఆరోగ్యం చేకూరుతాయని చెబుతారు.

తామర :

శ్రేయస్సు, శాంతికి చిహ్నంగా ఈ పువ్వు పరిగణిస్తారు. ఈ పువ్వును లక్ష్మీదేవికి ప్రీతిగా భావిస్తారు. కానీ శివునికి కూడా ఈ పువ్వు అంటే చాలా ఇష్టం. స్వచ్ఛమైన మనస్సుతో తామరపూలను సమర్పిస్తే.. మోక్షం పొందుతారు.

గులాబీ :


ఈ అందమైన పువ్వు.. అందరూ దేవుళ్లకు సమర్పిస్తాం. గులాబీలను శివునికి సమర్పిస్తే.. రోగనిరోధక శక్తి, ఆరోగ్యం, దీర్ఘాయువు, సంతోషయం లభిస్తాయని చెబుతారు.

మల్లెపువ్వు :

మల్లెపువ్వులు శివునికి ప్రీతి. ఇవి సమర్పించడం వల్ల.. శ్రేయస్సు లభిస్తుంది. సంపదలు చేకూరుతాయి. జీవితంలో సానుకూలత ఉంటుంది. అంతేకాదు.. ఇల్లు ధాన్యాగారం అవుతుంది. అంటే.. ఆహారానికి కొరతంటూ ఉండదు.

బిల్వ పువ్వులు :


మామూలుగా బిల్వ పత్రాన్ని సమర్పించకుండా చేసే శివపూజ ఫలించదని చెబుతారు. అయితే ఈ ఆకులు, కాయలే కాదు.. పువ్వులు కూడా ఆయనకు ప్రీతికరమైనవే. ఈ పువ్వుల వల్ల దాంపత్య సుఖం లభిస్తుంది. సరైన భాగస్వామి కోసం వెతికే వాళ్లు, వివాహ సమస్యలు ఉన్నవాళ్లు ఈ పువ్వులతో పూజించండి.

మల్లె పువ్వు :


సువాసనతో కూడిన ఈ పూలంటే శివునికి చాలా ఇష్టం. మనల్నే మంత్రముగ్ధుల్ని చేయడమే కాదు.. ఆ దేవుడికీ ప్రీతే. ఈ పూలతో పూజిస్తే ధాన్యాల కొరత ఉండదు.

మోదుగ

హిందూ సంప్రదాయంలో మోదుగను ప్రధానంగా చూస్తారు. అగ్నిపూలుగా ఈ పిలిచే ఈ పువ్వులు శివపూజలో ప్రముఖంగా ఉంటాయి. ఇంట్లో చెడుపోయి మంచి జరుగాలని కోరుకునే వారికి ఈ పువ్వులు శ్రేష్టం.

జిల్లేడు

శివరాధానకు జిల్లేడు శ్రేష్టం. దారిద్ర్యాన్నితొలగించే పువ్వులుగా వీటిని అభివర్ణిస్తారు. అంతేకాదు.. ఇంట్లో సుఖ, శాంతులు నెలకొనాలంటే ఈ పువ్వులను శివారాధనలో ఉంచండి.