మహబూబ్‌నగర్ టికెట్ నాకే, అవన్నీ అబద్దాలు.. జితేందర్ - MicTv.in - Telugu News
mictv telugu

మహబూబ్‌నగర్ టికెట్ నాకే, అవన్నీ అబద్దాలు.. జితేందర్

March 14, 2019

లోక్‌సభ ఎన్నికల్లో ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఇవ్వనని టీఆర్ఎస్ నేత, సీఎం కేసీఆర్ చెప్పడం తెలిసిందే. దీంతో ఆ ఒకిరద్దరు ఎవరే చర్చ ఊపందుకుంది. వీరిలో మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని, అందుకే ఆయన టికెట్ దక్కకపోవచ్చని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జితేందర్ ఘాటుగా స్పందించారు.

 

Mahaboob nagar sitting mp jitender reddy affirms mp trs ticket his and denied talks with telangana congress.

 

‘నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో లేను. మహబూబ్‌నగర్ టికెట్ మళ్లీ నాకే దక్కుతుంది. నేనంటే గిట్టనివారే నాకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌ గారిపై నాకు  పూర్తి విశ్వాసం ఉంది. నేను కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడాను. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోడానికి ఎంతో కష్టపడ్డాను.. మహబూబ్ నగర్ టికెట్ నాకే దక్కుతుంది.. ’ అని అన్నారు.

ఇటీవల జరిగిన టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, పార్టీకి నష్టం కలిగిస్తున్న ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఇవ్వనని అన్నారు. ఈ జాబితాలో జితేందర్ రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. జితేందర్ రెడ్డి.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో మంతనాలు జరిపారని, తాను కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి యత్నించారని ప్రచారం జరిగింది. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు సహకరించలేదనే ఆరోపణలూ ఉన్నాయి.