ఆఫీసులో బట్టలు విప్పుకుని  పైసా వసూల్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆఫీసులో బట్టలు విప్పుకుని  పైసా వసూల్..

April 15, 2019

కొన్ని చిట్‌ఫండ్ కంపెనీలు కస్టమర్ల జీవితాలతో చెలగాటం ఆడుకుంటుంటాయి. వినియోగదారులు.. చేసేదేమీ లేక అవి చెప్పినట్టు వింటున్నారు, డబ్బు కోసం ఓపిగ్గా వేచిచూస్తున్నారు. గొర్రె శ్రీనివాస్ కూడా మొదట్లో అలాగే వేచి చూశారు. కానీ సహనం నశించడంతో చిట్‌ఫండ్ కంపెనీకి దిమ్మతిరిగే షాకిచ్చాడు. నేరుగా ఆ కంపెనీ ఆఫీసుకు వెళ్లి బట్టలు విప్పేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఈ సంఘటన జరిగింది.

Mahaboobabad teacher disrobed himself for collecting his money from kapil chit fund half naked protest

టీచర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ కపిల్ చిట్‌ఫండ్‌లో  50 నెలల చీటీకింద నెలకు రూ. 20 వేల చొప్పున రూ.10 లక్షలు కట్టారు. 49వ నెలైన  డిసెంబర్‌లో చీటీ పాడారు. జనవరిలో డబ్బులు మొత్తం ఇస్తామని చెప్పిన కంపెనీ తర్వాత పట్టించుకోలేదు. అడితే, రేపోమాపో అని తిప్పి పంపుతోంది. డబ్బులు లేవని, కొన్నాళ్లు ఆగాలని చెప్పారు. ఫోన్ చేస్తే స్పందించడం మానేసింది. 4 నెలలు గడుస్తున్నా పైసలు  డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీనివాస్ మండిపడ్డారు. ఇటీవల ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఈ నెల 10న డబ్బులు ఇస్తామని కంపెన చెప్పుకొచ్చింది. అయితే మాట నిలబెట్టుకోలేదు. శ్రీనివాస్ సోమవారం చిట్ ఫండ్ ఆఫీసుకెళ్లి మేనేజర్ గదిలో బట్టలు విప్పేసి టేబుల్‌పై బాసింపట్టు వేసుకుని కూర్చున్నారు. దీంతో అక్కడి సిబ్బంది ఠారెత్తిపోయారు. వెంటనే రూ. 9 లక్షల చెక్కును శ్రీనివాస్ చేతిలో పెట్టారు.

15-04-2019..మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ లో 10 లక్షల చిట్టీ గడువు తీరినా డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు చిట్ ఫండ్ కార్యాలయంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించాడు బాధితులు

Posted by Gujarathi Ram Prasad on Monday, 15 April 2019