ఎంత మంచి ఫోటో.. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కి సలాం..! - MicTv.in - Telugu News
mictv telugu

ఎంత మంచి ఫోటో.. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కి సలాం..!

July 10, 2017

దృష్టిని బట్టే సృష్టి . ప్రతీదానిని సూశే మనసుండాలి ..కష్టం సుఖం దుఖం అన్నీ అద్బుతంగా కనిపిస్తాయి,బహుశా ఇలాంటి మనసున్నోడే ఈ ఫోటో తీశుంటడు.చెమట విలువ తెలిశినోడే తన కెమెరాకు పని చెప్పుంటడు అందుకే ఇంత మంచి ఫోటో,ఈ పోటో ఇప్పటకే ఫేస్ బుక్కు వాట్సప్ లల్లో చెక్కర్లు కొడుతుంది.

అయినా మా వెబ్ సైట్ లో వెయ్యాలని తలిచినం.చుట్టూ పచ్చని ప్రకృతి,అటు ఇటూ బాడీగార్డుల లాగ రొండు ఎడ్లు,ఏం జర్గకుండా చూసుకోవాడానికి  వెనకాల తాత అనే ధైర్యం, ఇన్నిటి మద్య నాగలికి కట్టిన ఊయలలో పిల్లాడు, ఆహా ఎంత సుందరమైన దృశ్యం కదా…మహబూబా బాద్ జిల్లా పూసపల్లి లో ఓ రైతు తన మనుమడిని  నాగలికి కట్టిన ఊయలలో వేసి దున్నుతుంటే ఆంద్రజ్యోతి ఫోటోగ్రాఫర్  పాలకుర్తి మధు తీసిన ఫోటో ఇది.ఇటు పొలం దున్నాలి.. అటు తనతో వచ్చిన మనువడిని ఎటూ పోకుండా పైలంగ జూస్కోవాలే..దానికోసం ఆ రైతు చేసిన ఉపాయం ఇది.పల్లెలల్లో ఇలాంటి దృశ్యాలు ఎన్నో.అయినా  పట్నాలల్లున్న  మన ప్రేమల ముందు గీ తాత ప్రేమ ఏపాటిది కదా,జాబులల్ల మనం బిజీగుంటే…పోరగాన్లను  చూస్కోనికి బేబీ కేర్ సెంటర్లు ఉండే…ముసలోల్లను  సూస్కోనీకి  ఓల్డేజ్ హోమ్ లుండే…పైసా వాడేస్తే  సాలు..ప్రేమ అప్యాయతలు అన్ని  కొనీయచ్చు కదా.కనీ తాత ప్రేమ అనే ఊయలలో ఊగుతున్న గీ పిలగాని ఆనందాన్ని…ఏ బేబీకేర్ సెంటర్లు ఇస్తయ్ జెప్పున్రి.