విషాదాంతంగా మహబూబాబాద్ కిడ్నాప్ కథ.. దీక్షిత్ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

విషాదాంతంగా మహబూబాబాద్ కిడ్నాప్ కథ.. దీక్షిత్ మృతి

October 22, 2020

bfbcfdb

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం జర్నలిస్టు రంజిత్ తనయుడు దీక్షిత్(9) కిడ్నాప్‌ అయిన విషయం విదితమే. గత మూడు రోజులుగా పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలించారు. ఎట్టకేలకూ కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తు దీక్షిత్‌ను రక్షించలేకపోయారు. దీక్షిత్‌ను కిడ్నాపర్లు హత్యచేసి చేసి మహబూబాబాద్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలోని తాళ్ల పూసలపల్లి అటవీ ప్రాంతంలో పడేశారు. రంజిత్ రెడ్డి సమీప బంధువు అయిన మనోజ్ రెడ్డి ఒక ముఠాతో కుమ్మకై ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.

స్థానిక కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న రంజిత్‌, వసంత దంపతుల పెద్ద కుమారుడు దీక్షిత్ ఆదివారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా దొరకలేదు. బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు దీక్షిత్‌ని తీసుకుపోయారని స్థానికులు తెలిపారు. ఆరోజు రాత్రి 9:45 నిమిషాలకు కొందరు కిడ్నాపర్లు వసంతకు ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. అడిగిన మొత్తం ఇస్తే దీక్షిత్‌ను విడిచిపెడతామన్నారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని హెచ్చరించారు. బాలుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో తమ వ్యక్తులు ఉన్నారని బెదిరించారు. మీరు ఏం చేస్తున్నా మాకు తెలుస్తుందిని తెలిపారు. మీ బాబుకు జ్వరంగా ఉండడంతో మాత్రలు కూడా వేశామని చెప్పారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.