దీక్షిత్ హత్య.. కిడ్నాపర్ల ఎన్‌కౌంటర్! - MicTv.in - Telugu News
mictv telugu

దీక్షిత్ హత్య.. కిడ్నాపర్ల ఎన్‌కౌంటర్!

October 22, 2020

ngfhnbtr

గత ఆదివారం సాయంత్రం కిడ్నాప్‌కు గురైన దీక్షిత్ రెడ్డి కథ విషాదాంతం అయింది. కిడ్నాపర్లను దీక్షిత్‌ను అపహరించిన రెండు గంటల్లోనే హత్య చేశారు. కేసముద్రం మండలం అన్నారం దానమయ్య గుట్టపై బాలుడిని హత్యచేసి పెట్రోల్‌ పోసి మృతదేహాన్ని కాల్చేశారు. బాలుడి మృతదేహన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాళ్ల పూసలపల్లి అటవీ ప్రాంతంలో పడేశారు. ఈరోజు బాలుడి మృతదేహాన్ని పోలిసులు గుర్తించారు. బాలున్ని చంపేసాక మొబైల్ యాప్ ద్వారా అతని కుటుంబానికి ఇంటర్నెట్ కాల్స్ చేసి రూ.45 లక్షలు డిమాండ్ చేశారు. 

దీంతో బాధిత కుటుంబం కిడ్నాపర్ల డబ్బు ఇవ్వడానికి సిద్దపడింది. దీక్షిత్ తండ్రి రంజిత్ రెడ్డి డబ్బుల బ్యాగుతో కిడ్నాపర్లు రమ్మన్న చోటికి వెళ్లి రాత్రి అంతా అక్కడే ఉన్నాడు. ఇంతలో దుండగులు బాలుడ్ని హత్య చేసినట్టు తేలింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. దీక్షిత్‌ను తన బాబాయ్ కుసుమ మనోజ్‌రెడ్డి.. మంద సాగర్ అనే వ్యక్తితో కలిసి కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సులభంగా డబ్బులు సంపాదించడానికే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. దొరుకుతామనే భయంతోనే బాలున్ని చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాపర్లు మనోజ్‌రెడ్డి, మందసాగర్‌ను పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.