జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్.. రూ. 45 లక్షలు ఇవ్వాని డిమాండ్ - MicTv.in - Telugu News
mictv telugu

జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్.. రూ. 45 లక్షలు ఇవ్వాని డిమాండ్

October 19, 2020

ngvnfg

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తొమ్మిదేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. స్థానిక కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న ప్రముఖ టీవీ చానల్‌ వీడియో జర్నలిస్టు రంజిత్‌, వసంత దంపతుల పెద్ద కుమారుడు దీక్షిత్ ‌రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా దొరకలేదు. బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు దీక్షిత్ రెడ్డిని తీసుకుపోయారని స్థానికులు తెలిపారు. ఆరోజు రాత్రి 9:45 నిమిషాలకు కొందరు దుండగులు వసంతకు ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. 

అడిగిన మొత్తం ఇస్తే బాలుడిని విడిచిపెడతామన్నారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని హెచ్చరించారు. బాలుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో తమ వ్యక్తులు ఉన్నారని బెదిరించారు. మీరు ఏం చేస్తున్నా మాకు తెలుస్తుందిని తెలిపారు. మీ బాబుకు జ్వరంగా ఉండడంతో మాత్రలు కూడా వేశామని చెప్పారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు స్వీకరించిన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కిడ్నాప్ జరిగిన ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సంఘటన గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చుట్టూ పక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. కిడ్నాపర్ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కిడ్నాపర్లు ప్రైవేట్ ఫోన్‌ నంబర్లతో చేస్తుండడం వల్ల వారి ఆచూకీని కనిపెట్టలేక పోతున్నామని పోలీసులు తెలిపారు.