తాహసీల్దార్‌ను భూజాలపై మోసిన రైతులు..ఎందుకంటే - MicTv.in - Telugu News
mictv telugu

తాహసీల్దార్‌ను భూజాలపై మోసిన రైతులు..ఎందుకంటే

February 3, 2020

mro02

మహబూబాబాద్ జిల్లాలో ఓ తాహసీల్దార్‌ను రైతులు తమ భుజాలపై మోస్తూ ప్రశంసించారు. అరవై 60 ఏళ్లుగా పరిష్కారం లేకుండా ఉన్న భూముల వివరాలను జాగ్రత్తగా రైతులకు పట్టాలు అప్పగించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా ఈ పని పూర్తి చేయడంతో ఆయనపై రైతులు పూల వర్షం కురిపించారు. ఎంతో మంది అధికారులు చూపించలేని పరిష్కారాన్ని తహసీల్దార్ రంజిత్ చూపించారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. 

జిల్లాలోని మల్యాల గ్రామానికి చెందిన రైతులకు పట్టాదారు పాసు బుక్కుల వివరాలు చాలా కాలంగా తప్పుల తడకగానే ఉన్నారు. సర్వే నంబర్లకు భూముల హద్దులకు చాలా తేడా ఉంది. దీంతో ఎంతో మంది అధికారులు మారినా దానికి పరిష్కారం చూపించలేదు. దీనికి తోడు   2018 లో భూరికార్డుల ప్రక్షాళనలో మరింత గందరగోళం నెలకొంది.1809 మంది రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు, రైతు బీమా అందడం లేదు. దీన్ని నిరసిస్తూ గత ఎన్నికల సమయంలో రైతులు రాజకీయ నాయకులను తమ గ్రామంలోకి రానివ్వలేదు. స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చొరవతో తాహసీల్దార్ రంజీత్ ఈ పని పూర్తి చేసి 1549 మందికి పట్టాదారు పాసు బుక్కులు అందజేశారు. దీంతో రంజిత్​కుమార్‌ను రైతులు భుజాలపై ఎత్తుకుని పూల వర్షం కురిపించి సన్మానించారు.