గన్‌మెన్ హఠాన్మరణం..కన్నీరుమున్నీరైన ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

గన్‌మెన్ హఠాన్మరణం..కన్నీరుమున్నీరైన ఎమ్మెల్యే

July 19, 2019

Mahabubabad trs mla shankar naik gunmen  

మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దగ్గర గన్‌మెన్‌గా పని చేసిన శ్రీనివాస్ అకాల మరణంతో ఆయన ఒక్కసారిగా చలించిపోయారు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే  గన్‌మెన్ మరణ వార్త విని ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. శ్రీనివాస్ అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ గన్‌మెన్ పాడెను మోశారు. అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ విలపించన తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. గన్‌మెన్ శ్రీనివాస్.. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు కుడి భుజంలా.. భావించేవారని స్థానికులు చెబుతున్నారు.