మహబూబ్‌నగర్‌లో కాల్పులు.. చంపడానికి ప్రాక్టీస్.. - MicTv.in - Telugu News
mictv telugu

మహబూబ్‌నగర్‌లో కాల్పులు.. చంపడానికి ప్రాక్టీస్..

October 26, 2019

Mahabubnagar shooting practice .

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం తిమ్మసానిపల్లె రైల్వే ట్రాక్ వద్ద కలకలం రేగింది. ధన్ ధన్.. అంటూ కాల్పులు శబ్దాలు వినిపించడంతో స్థానికులు హడలెత్తిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నిందితులు చెప్పిన సమాధానం విని విస్తుపోయారు. వారి వద్ద నుంచి తుపాకీ, తూటాలతోపాటు ఒక వటే కొడవలిని కూడా స్వాధీనం చేసుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి, చిన్నయ్య అనే యువకులు గత ఏడాది ఓ వేడుకలో గొడవ పడ్డారు. తనను కొట్టిన వ్యక్తిపై రవి కక్ష పెంచుకున్నాడు. అతణ్ని ఎలాగైనా చంపాలని తుపాకీ కొనుక్కుని ప్రాక్టీస్ చేస్తున్నాడు. తిమ్మసానిపల్లె వద్ద కాల్పులు జరిపింది అందుకోసమేని రవి, చిన్నయ్య అంగీకరించారు. దీంతో పోలీసులు రవి టార్గెట్ చేసిన వ్యక్తి ఎవరో ఆరా తీస్తున్నారు. తుపాకీని ఎక్కడ కొన్నారో విచారిస్తున్నారు.