సావిత్రి బాటలో కీర్తీ సురేశ్..  సినిమా టీంకు బంగారు నాణేలు..  - MicTv.in - Telugu News
mictv telugu

సావిత్రి బాటలో కీర్తీ సురేశ్..  సినిమా టీంకు బంగారు నాణేలు.. 

October 9, 2019

Mahanati in Savitri Route.. Gold coins gift to movie team

‘మహానటి’ సినిమాలో నటించిన కీర్తీ సురేశ్‌కు సావిత్రి లక్షణాలే వచ్చినట్టున్నాయి. ఆపదలో వున్నవాళ్లను సావిత్రి ఆదుకున్నారు. చిత్ర పరిశ్రమలో తాను ఎవరితో పనిచేసినా వారందరితో ఎంతో స్నేహభావంతో వుండేవారు. అలాంటి మంచి మనసున్న సావిత్రి పాత్ర పోషించిన కీర్తి ఇప్పుడు ఆమెలానే మారిపోయారని అనిపిస్తుంది. ఎందుకంటే తాను పనిచేస్తున్న ఓ సినిమా టీంకి బంగారు బిళ్లలు బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురచేసింది. దీంతో సదరు మూవీ టీం సంతోషం తట్టుకోలేక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె గోల్డ్‌ కాయిన్స్ ఇలా బ‌హుమ‌తిగా ఇవ్వ‌డంతో చిత్ర బృందం చాలా ఆనందంగా ఫీల్ అయ్యామని తెలిపారు‌. కీర్తి ఇలా బంగారు నాణేలను బహుమతిగా ఇవ్వడం ఇదే కొత్త కాదు. మహానటి సినిమా టీంకి కూడా తాను బంగారు నాణేలు గిఫ్టుగా ఇచ్చింది.

సావిత్రి కూడా తాను హీరోయిన్‌గా ఉన్న సమయంలో ఇలాగే యూనిట్ సభ్యులు అందరికీ బహుమతులు ఇచ్చేవారట. ఈ విషయాన్ని పలువురు దర్శకులు వారి అనుభవాలలో పంచుకున్న విషయం తెలిసిందే. అలాగే గ‌తంలో ప‌లువురు స్టార్ హీరోలు కూడా ఇలా గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్‌గా అందించారు. కాగా, మ‌హాన‌టి సినిమాతో అందరి మ‌న‌సులు గెలుచుకున్న కీర్తి సురేష్.. తెలుగు, త‌మిళం, హిందీ సినిమాల‌తో బిజీగా ఉంది. ప్రస్తుతం ‘మిస్ ఇండియా’ అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాడానికి ప్రయత్నం చేస్తున్నారు.