నిర్మాత చక్రపాణిగా ప్రకాష్ రాజ్… - MicTv.in - Telugu News
mictv telugu

నిర్మాత చక్రపాణిగా ప్రకాష్ రాజ్…

August 22, 2017

అలనాటి ప్రముఖ సినీనటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మహానటి’. ఈ మూవీలో  కీర్తి సురేష్ ప్రధాన పాత్ర లో నటిస్తోంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్.. సావిత్రి భర్త  శివాజీ గణేషన్ పాత్రలో నటిస్తున్నాడు. సమంత జర్నలిస్ట్ పాత్రలో నటించగా ఆమె భర్తగా విజయ్ దేవరకండ నటిస్తున్నాడు. ఇప్పుడు ఆ సినిమాల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రముఖ నిర్మాత అలూరి చక్రపాణి పాత్రలో నటించనన్నట్టు  సమాచారం.అలూరి చక్రపాణి సావిత్రితో మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మకథ తదితర సినిమాలు తీశారు.

మహానటి సినిమా నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కితోంది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్నా దత్ నిర్మిస్తోంది. సావిత్రి తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ, హిందీ సినిమాలల్లో నటించి పలు అవార్డులు అందుకున్నారు.