సమంత జర్నలిస్ట్‌గా కాదు.. జమునగా - MicTv.in - Telugu News
mictv telugu

సమంత జర్నలిస్ట్‌గా కాదు.. జమునగా

November 30, 2017

అలనాటి విఖ్యాత నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న ‘మహానటి’ మూవీలో భారీ తారాగణం ఉన్న సంగతి తెలిసిందే. కీర్తిసురేశ్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, సమంత, దుల్కర్ రెహ్మాన్, మోహన్ బాబు, క్రిష్, విజయ్ దేవరకొండ, శాలినీ పాండే.. వంటి మరెందరో ఉన్నారు.ఇందులో సమంత.. జర్నలిస్టుగా నటిస్తోందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని స్వయంగా కీర్తి సురేశ్ చెప్పింది. సామ్.. జమునగా నటిస్తోందని మీడియాకు తెలిపింది. అయితే యూనిట్ మాత్రం అధికారికంగా చెప్పలేదు ఇంతవరకు. సావిత్రి, జమున కలసి చాలా హిట్ చిత్రాల్లో నటించడం తెలిసిందే.. ఈ సినిమాల విషయంలో యూనిట్ చాలా గోప్యత పాటిస్తోంది. కథ తెలిసిందే అయినా.. వివాదాలు వద్దనే ఇలా చేస్తోంది. మూవీ సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ .. ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా, స్నప్నా దత్ ఈ సినిమా నిర్మిస్తోంది.