‘మహానటి’ తొలిపాట.. అందమైన మూగమనసులు - MicTv.in - Telugu News
mictv telugu

‘మహానటి’ తొలిపాట.. అందమైన మూగమనసులు

April 20, 2018

అలనాటి ప్రఖ్యాతనటి సావిత్ర జీవితం ఆధారంగా వెండితెరకు ఎక్కుతున్న ‘మహానటి’ చిత్రం సినీపరిశ్రమలో ఎంతో ఆసక్తి రేకిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు చక్కని ఆదరణ లభించింది. టైటిల్ రోల్ పోషిస్తున్న కీర్తిసురేశ్ స్టిల్స్ చూస్తుంటే అచ్చం సావిత్రి మళ్లీ పుట్టినట్లు ఉందని కొనియాడుతున్నారు. ఈ ఉత్సాహంతో ఉన్న మూవీటీం కాసేపటి కింద ఈ సినిమా నుంచి తొలిపాటను విడుదల చేసింది.

మూగమనసులు అంటూ సాగే ఈ పాట సావిత్రి హిట్ మూవీ మూగమనసుల్లోని పాటను గుర్తుకు తెస్తోంది. మేఘాల్లో కీర్తి, దుల్కర్ సల్మాన్‌లు చక్కని జంటగా ఆడుతూపాడుతూ కనిపిస్తున్నారు. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా మిక్కీ జె.మేయర్‌ స్వరాలు అందించారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంతో వస్తున్న ఈ మూవీకి స్వప్నాదత్ నిర్మాత. మే 9న చిత్రం విడుదల కానుంది.