సావిత్రి భర్త పాత్రలో దుల్కర్.. అదుర్స్! - MicTv.in - Telugu News
mictv telugu

సావిత్రి భర్త పాత్రలో దుల్కర్.. అదుర్స్!

December 6, 2017

అలనాటి ప్రఖ్యాత సినీనటి సావిత్రి జీవితం ఆధారంగా ‘మహానటి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్ సావిత్రిగా నటిస్తోంది. సావిత్రి భర్త జెమినీ గణేశన్‌గా రొమాంటిక్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. దుల్కర్.. అచ్చం శివాజీ గణేశన్ హెయిర్ కట్, మీసాలతో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహానటిలో దుల్కర్ గెటప్ ఇదేనని మూవీ టీం అధికారికంగా ప్రకటించకపోయినా.. లుక్ గణేశన్‌ది కావడంతో ఇది మూవీలోనిదేనని స్పష్టం అవుతోంది. గణేశన్ అప్పట్లో స్టార్ హీరోగా అమ్మాయిల మనసు దోచుకున్నాడు. సావిత్రి ఆయన అందచందాలకు మురిసిపోయే.. అతనికి అప్పటికే పెళ్లయినా ఆయనను వివాహం చేసుకుందని అంటారు.కాగా, మహానటి మూవీ టీం కాసేపట్లో సావిత్రి బర్త్ డేను పురస్కరించుకుని  సర్ ప్రైజ్ ఇవ్వడికి సిద్ధంగా ఉంది. అది టీజరా, ట్రైలరా తెలియడం లేదు. దీనికి సంబంధించి టీం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. సావిత్రి నటించిన మాయాబజార్ మూవీలోని ప్రియదర్శిని పెట్టె అందులో ఉంది. ఆ పెట్టె తెరిస్తే ఎవరికి ఏది ఇష్టమో అది కనిస్తుంది. మరి ఈ టీం చూపుతున్న పెట్టెలోంచి ఏం బయటపడుతుందా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. మహానటి మూవీకి నాగ అశ్విన్ డైరెక్టర్. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వ‌నీ దత్ నిర్మిస్తున్నారు. మోహన్ బాబు, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత, షాలిని పాండే, క్రిష్, తరుణ్ భాస్కర్, భానుప్రియ వంటి భారీ తారాగణం ఉంది.