రేపు ‘మహానటి’ సర్‌ప్రైజ్.. ఏంటది? - MicTv.in - Telugu News
mictv telugu

రేపు ‘మహానటి’ సర్‌ప్రైజ్.. ఏంటది?

December 5, 2017

అలనాటి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా ‘మహానటి’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేశ్ టైటిల్ రోల్ పోషిస్తోంది. సినిమా దాదాపు పూర్తయింది. అయితే వివరాలను చాలా రహస్యంగా ఉంచుతున్నారు.

ఒక లుక్ తప్ప మరేవీ బయటికి రాలేదు. అందులోనూ కీర్తి కళ్లు మాత్రమే చూపించారు. అయితే  రేపు సావిత్రి జయంతి కావడంతో ఈ మూవీ టీమ్ సర్ ప్రైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అది టీజరా, ట్రైలరా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.  ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో ఏక కాలంలో తీస్తున్నారు. జమునగా సమంత, సావిత్రి భర్తగా దుల్కర్ సల్మాన్, ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.