మహానటి సర్‌ప్రైజ్ చెప్పేశారు..! - MicTv.in - Telugu News
mictv telugu

మహానటి సర్‌ప్రైజ్ చెప్పేశారు..!

December 6, 2017

సావిత్రొ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘మహానటి’ చిత్ర బృందం నిన్న చెప్పినట్టుగానే సర్‌ప్రైజ్‌ సంగతి బయటపెట్టింది. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 29న విడుదల చేయనున్నారు. ఈ మూవీ లోగోతో రూపొందించిన వీడియోను బుధవారం సావిత్రి జయంతి సందర్భంగా విడుదల చేశారు.  

తెలుగు హిట్ మూవీ ‘మాయాబజార్ ’లోని ప్రియదర్శిని పేటికను చూపించారు వీడియోలో. దీన్ని ఓ మహిళ తెరవగా బంగారు వర్ణంతో తీర్చిదిద్దిన ‘మహానటి’ అనే టైటిల్‌ బయటికి వచ్చింది. ఇందులో డైలాగులు కూడా వినిపించారు. ‘అది ప్రియదర్శిని వదినా.. ఆ పేటిక తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తువు వారికి కనిపిస్తుంది, మీకు పెళ్లైందా.. అయితే నన్ను చేసుకుంటారా?, అయ్యోరామ, నమో కృష్ణ, అలిగిన వేళనే చూడాలి, నన్ను వదిలి నీవు పోలేవులే, ఈ నాటి ఈ బంధం ఏనాటిదో..’ అంటూ సావిత్రి  నటించిన సినిమాల్లోని సంభాషణలు పాటలను వినిపించారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్,  సమంత, విజయ్‌ దేవరకొండ, విక్రమ్‌ ప్రభు, షాలిని పాండే, ప్రకాశ్‌రాజ్‌, మోహన్‌బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రూపొందించి ఒకేసారి విడుదల చేశారు.