షాంగై ఫిలిం ఫెస్టివ‌ల్‌లో 'మ‌హాన‌టి' - MicTv.in - Telugu News
mictv telugu

షాంగై ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ‘మ‌హాన‌టి’

June 13, 2019

ప్రముఖ న‌టి సావిత్రి జీవిత ఆధారంగా రూపొందిన చిత్రం మ‌హాన‌టి. 2018లో విడుద‌లైన మ‌హాన‌టి చిత్రానికి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వచించగా వైజయంతీ మూవీస్ నిర్మించింది. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డ‌మే కాక‌, భారీ వ‌సూళ్ళు కూడా రాబ‌ట్టింది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ న‌ట‌న‌కి ప్రేక్ష‌కులు జేజేలు ప‌లికారు.

మ‌హాన‌టి చిత్రం ఇప్ప‌టికే ఎన్నో ఘ‌న‌త‌లు సాధించ‌గా, తాజాగా మ‌రో ఘ‌న‌త ఈ చిత్రం జాబితాలో వచ్చి చేరింది. చైనాలోని షాంగైలో జూన్ 15 నుండి 24 వరకు 22వ షాంగై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ జ‌ర‌గ‌నుండ‌గా, ఇందులో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. షాంగైలో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న తొలి భారతీయ సినిమాగా మ‌హాన‌టి అరుదైన ఘ‌న‌త సాధించింది. స్వ‌ప్న సినిమాస్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని ప్రేక్షకులతో పంచుకుంది.