ఈ ‘మహానుభావుడు’ అతి శుభ్రుడు! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ‘మహానుభావుడు’ అతి శుభ్రుడు!

August 25, 2017

‘ భలే భలే మగాడివోయ్ ’ సినిమాతో హిట్టు కొట్టిన మారుతి తర్వాత వెంకటేష్ తో ‘ బాబు బంగారం ’ తీసాడు. సంవత్సరం గ్యాప్ తర్వాత ఇప్పుడు తాజాగా ‘ మహానుభావుడు ’ సినిమా తీస్తున్నాడు. శర్వానంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ మూవీ ఇది. ఈ మధ్యే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ సినిమా థీమ్ మాత్రం భలే భలే మగాడివోయ్ సినిమా నుంచే తీస్కున్నాడట. అందులో నానీకి మతిమరుపుంటుంది. ఇందులో శర్వాకు అతి శుభ్రత గురించిన యావ వుంటుంది. టీజర్ లోనే హీరోయిన్ అతనికి లిప్ కిస్ ఇవ్వడానికొస్తే నోరు కడుక్కున్నావా అని క్శశ్చన్ చేస్తాడు. ఓసిడి అనే డిజార్డర్ చుట్టూ ఎంటర్ టైన్ మెంటును జోడించి సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రీకరించాడనే అంచనాల్లో వున్నారు ఆడియన్సు. దసరా కానుకగా వస్తున్న మహానుభావుడు సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి మరి.