Maharani Elizabeth-2 is no more..He will be the next king
mictv telugu

మహారాణి ఎలిజబెత్‌-2 ఇకలేరు..నెక్ట్స్ రాజుగా అతడే

September 9, 2022

బ్రిటన్‌ మహారాణి రెండో ఎలిజబెత్‌ (96) కన్నుమూశారు. బ్రిటన్‌ను అత్యధిక కాలం పరిపాలించిన రాణిగా ఆమె చరిత్రలో నిలిచారు. అనారోగ్య రీత్యా గతకొన్ని రోజులుగా బాధపడుతున్న ఆమె..గురువారం స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్ క్యాజిల్‌లో కన్నుమూశారు. బ్రిటన్‌ను పరిపాలించిన రాణుల్లో.. ఆమె ఏకంగా 70 ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించి రికార్డ్ సృష్టించారు.

“ఈ మధ్యాహ్నం (గురువారం) బల్మోరల్‌లో రాణి ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు” అని బర్మింగ్ హమ్ ప్యాలెస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం ఉదయమే రాణి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు పేర్కొనడంతో..ఆమె కుటుంబ సభ్యులైనా ఆమె కుమారుడు ప్రిన్స్ ఛార్లెస్, ఆయన భార్య కామిల్లా, మనుమడు ప్రిన్స్ విలియమ్ బల్మోరల్ చేరుకున్నారు.

రాణి మరణంతో ఆమె పెద్ద కుమారుడు, వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్ నూతన రాజుగా, 14 కామన్వెల్త్ దేశాలకు దేశాధినేతగా వ్యవహరించనున్నారు. రాణి మరణం దేశానికి, ప్రపంచానికి తీరని లోటని ఛార్లెస్, ప్రధాని లిజ్ ట్రస్ అభివర్ణించారు. ఆమె మరణం పట్ల పలువురు దేశాధినేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఎలిజబెత్-2 తన నాయకత్వంలో బ్రిటిష్ జాతికి స్ఫూర్తినందించారని భారత ప్రధాని మోదీ తన సంతాప సందేశంలో కొనియాడారు. ఆమె దృఢమైన నేతగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు.

ఆమె మృతదేహాన్ని ప్రజల సందర్శనార్ధం బకింగ్‌హాం ప్యాలెస్‌కు తీసుకురానున్నారు. తీవ్ర అనారోగ్యం పాలైన ఆమెను స్కాట్లాండ్‌లోని బల్మోరా రాజభవనంలో వైద్య పర్యవేక్షణలో ఉంచారు. వేసవి విడిది కోసం స్కాట్లాండ్‌ రాజభవనానికి వెళ్లిన క్వీన్‌ ఎలిజబెత్‌ అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ (99) గత ఏడాది ఏప్రిల్‌లో కన్నుమూశారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, 20 మంది మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లు ఉన్నారు.