భారతరత్న సావర్కర్‌కు కాదు గాడ్సేకు ఇవ్వండి..కాంగ్రెస్  - MicTv.in - Telugu News
mictv telugu

భారతరత్న సావర్కర్‌కు కాదు గాడ్సేకు ఇవ్వండి..కాంగ్రెస్ 

October 17, 2019

Maharashtra Assembly Elections 2019

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అధికార బీజేపీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. రాష్ట్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే..హిందూత్వ సిద్ధాంత రూపకర్త, స్వతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్‌కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ప్రకటించేలా ప్రయత్నిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

వీర్ సావర్కర్‌ తోపాటు మహాత్మా ఫూలే, సావిత్రిభాయ్ ఫూలేలను కూడా భారతరత్న కోసం కేంద్రానికి సిఫారసు చేస్తామని వెల్లడించారు. వీర్ సావర్కర్‌ను భారతరత్న కోసం సిఫార్సు చేయడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ అంశమై కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారి స్పందిస్తూ సావర్కర్‌కు బదులు నేరుగా నాథూరాం గాడ్సేకు ఈ భారతరత్న పురస్కారాన్ని అందించాలని వ్యాఖ్యానించారు. ‘మహాత్మా గాంధీని చంపడానికి సావర్కర్‌ కుట్ర పన్నారనే ఆరోపణలు మాత్రమే వచ్చాయి.. అయితే గాడ్సే మాత్రం నేరుగా గాంధీని హత్యచేశారని’ పేర్కొన్నారు. ఈ ఏడాది మనం మహాత్మా గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్న క్రమంలో ఎన్డీయే ప్రభుత్వం సావర్కర్‌కు బదులు నేరుగా గాడ్సేకు భారతరత్న ప్రదానం చేయాలని మనీష్‌ తివారీ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.