బ్యాలెట్ పేపర్లను మర్చిపోండి...ఎన్నికల సంఘం - MicTv.in - Telugu News
mictv telugu

బ్యాలెట్ పేపర్లను మర్చిపోండి…ఎన్నికల సంఘం

September 19, 2019

maharashtra assembly polls.......

సార్వత్రిక ఎన్నికలు ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్లతో జరపాలని కాంగ్రెస్ పార్టీ సహా 23 రాజకీయ పార్టీలు కోరిన సంగతి తెలిసిందే. అయితే ఎలక్షన్ కమీషన్ మాత్రం ఈవీఎంల ద్వారానే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించింది. 

తాజాగా బ్యాలెట్ పేపర్ల ప్రస్తావన మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్ అరోడా.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర అధికారులతో, రాజకీయ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. తరువాత మీడియాతో మాట్లాడారు.. బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని, బ్యాలెట్‌ పత్రాలు ఇక చరిత్రగా మిగిలిపోతాయని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీల నేతలు బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరారని, అది సాధ్యం కాదని చెప్పామని, అది ఇకపై చరిత్రేనని ఆయన అన్నారు. ఈవీఎంలు సరిగ్గా పని చేయకపోవచ్చునేమో కాని, వాటిని ట్యాంపర్‌ చేయడం మాత్రం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.