సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా

November 26, 2019

మహారాష్ట్ర రాజకీయ నాటకం అనూహ్య మలుపులు తీసుకుంటోంది. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ నెల 23న రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన కేవలం మూడు రోజలు మాత్రమే పదవిలో ఉన్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు బీజేపీ తన బలం నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఎన్సీపీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట వచ్చే అవకాశం లేకుండా పోయింది. అజిత్ కూడా తిరిగి ఎన్సీపీ వైపు వెళ్లేందుకు మొగ్గుచూపుతూ తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ సంక్షోభంలో పడింది. తప్పని సరి పరిస్థితుల్లో ఫడ్నవీస్ రాజీనామా చేశారు. 

CM Devendra Fadnavis.

తన రాజీనామాను అధికారికంగా ప్రకటిస్తూ శివసేనపై నిప్పులు చెరిగారు.‘మాకు పార్టీలను చీల్చడం,ఎమ్మెల్యేలను కొనడం ఇష్టం ఉండదు. మిత్రధర్మానికి శివసేన వెన్నుపోటు పొడిచింది. మాకు నమ్మక ద్రోహం చేశారు. రాష్ట్రపతి పాలన ఉండకూడదనే అజిత్ పవార్ మాతో చేతులు కలిపారు. బీజేపీ కూటమికి ప్రజలు 70 శాతం ఓటింగ్‌తో పట్టం కట్టారు. ప్రజా తీర్పుకు శివసేన వెన్నుపోటు పొడిచింది’ అంటూ మండిపడ్డారు.  బీజేపీ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కేవలం 72 గంటల్లోనే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలడం విశేషం.