Home > Featured > మహారాష్ట్రను పొంచిఉన్న నిసర్గ తుపాను

మహారాష్ట్రను పొంచిఉన్న నిసర్గ తుపాను

bgvb v

మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు అయింది మహారాష్ట్ర పరిస్థితి. ఇప్పటికే దేశంలోనే అత్యధిక కరోనా వైరస్ కేసులతో సతమతమవుతోన్న మహారాష్ట్రకు నిసర్గ తుఫాన్ పేరుతొ మరో ముప్పు పొంచి ఉంది. అరేబియా సముంద్రంలో ఆ రాష్ట్ర రాజధాని ముంబైకి 690 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం తుపానుగా రూపాంతరం చెందింది. బుధవారం మధ్యాహ్నం సమయానికి ముంబైకి చేరుకునే అవకాశం ఉంది. రాబోయే 12 గంటల్లో ముంబై నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గంటలకు 100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

దీంతో కరోనా వైరస్‌ బాధితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా బాధితులతో పాటు 10 వేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. నిసర్గ తుపాను నేపథ్యంలో ప్రధాని మోదీ, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. అవసరమైన సాయాన్ని అందిస్తామని తెలిపారు. రెండు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో 30 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు.

Updated : 2 Jun 2020 11:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top