సీఎం పదవి మాకే ఇయ్యాలే..శివసేన నేత - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం పదవి మాకే ఇయ్యాలే..శివసేన నేత

October 24, 2019

Maharashtra .

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి విజయం లాంఛనప్రాయం అయింది. ఈ రెండు పార్టీలు మొదటి రెండు స్థానాల్లో దూసుకుపోతున్నాయి. శివసేన పార్టీ గతంతో పోలిస్తే ఈసారి మెరుగుపడింది. ఈ నేపథ్యంలో ఈసారి మహారాష్ట్ర సీఎం పదవి బీజేపీ, శివసేనలో ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. శివసేన కింగ్ మేకర్‌గా మారింది. దీంతో ఈసారి సీఎం పదవి తమకే ఇవ్వాలని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. 

ఇప్పటికే బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే డిప్యూటీ సీఎం అవుతారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా శివసేనకు బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందనే ప్రచారంతో సీఎం సీటు తమకే ఇవ్వాలనే డిమాండ్‌ను శివసేన తెరపైకి తీసుకొని వచ్చారు. మరోవైపు శివసేనకు బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదని… మళ్లీ మహారాష్ట్ర బీజేపీ సీఎం స్థానం తమదే అని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.