మహారాష్ట్ర ఎన్నికలు..శివసేనకు ఎన్‌సీపీ మద్దతు! - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్ర ఎన్నికలు..శివసేనకు ఎన్‌సీపీ మద్దతు!

October 26, 2019

ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హరియాణాలో హాంగ్ ఏర్పడగా మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. హాంగ్ ఏర్పడిన హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటు ఓ కొలిక్కి వచ్చింది. అక్కడ బీజేపీ-జేజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారాన్ని చేపట్టబోతున్నాయి. కానీ, మహారాష్ట్రలో మాత్రం ఇంకా ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడటం లేదు. బీజేపీ మిత్రపక్షం శివసేన పెట్టిన షరతులు ఇందుకు కారణం. ముఖ్యమంత్రి పీఠాన్ని తమకు కూడా ఇవ్వాలని శివసేన డిమాండ్‌ చేస్తుండడంతో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. 

ఈసారి బీజేపీకి ఆశించినన్ని సీట్లు రాకపోవడంతో శివసేన దూకుడు పెంచింది. శివసేన 56 సీట్లలో గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందం ప్రకారం పదవులు చేరి సగం అంటోంది. దీంతో ఏం చేయాలో తోచక బీజేపీ పార్టీ సతమమమవుతోంది. ఈ నేపథ్యంలో శివసేన పార్టీకి మహారాష్ట్రలో 54 సీట్లలో గెలుపొందిన ఎన్సీపీ పార్టీ మద్దతు ఇస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవర్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి పీఠాన్ని చెరిసగం రోజులు పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌లో న్యాయం ఉందన్నారు. శివసేన చేస్తున్న డిమాండ్‌ కొత్తదేమీ కాదని, 1990లో కూడా ఈ ఫార్ములాను అనుసరించిన కారణంగా తాజాగా వారీ డిమాండ్‌ చేస్తున్నారని వెనకేసుకొచ్చారు. దీంతో శివసేన డిమాండ్‌కు మరింత బలం చేకూరింది. ఒకవేళ శివసేనకు బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వని యెడల శివసేన-ఎన్సీపీ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. శివసేన 56 సీట్లలో గెలుపొందింది. శివసేన-ఎన్సీపీ కలిస్తే 110 సీట్లు అవుతున్నాయి. ఈ మొత్తం బీజేపీ సీట్ల కంటే ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ 44 సీట్లు గెలవడంతో ఆ పార్టీ బయటినుంచి మద్దతు ఇచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ మరో వివాదానికి దారి తీసింది. సంజయ్ రౌత్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ కార్టూన్ పోస్ట్ చేశారు. అందులో పులి చేతిలో కమలం పువ్వు ఉంది. ఇది శివసేన చేతుల్లో బీజేపీ భవితవ్యం ఉందని సూచిస్తోంది. దీంతో ఈ ట్వీట్‌పై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.