పులిని పట్టుకుంటుందని తెస్తే మనిషిని చంపేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

పులిని పట్టుకుంటుందని తెస్తే మనిషిని చంపేసింది..

October 3, 2018

మనుషులను చంపి తినే పులిని పట్టుకోవడానికి చేపట్టిన ఆపరేషన్‌లో ఒక మహిళ బలైపోయింది. పులిని ఆకర్షించి వల్లో వేసుకోవడానికి తెచ్చిన ఏనుగుల్లో ఒకటి పారిపోయి పలు గ్రామాల్లో అలజడి సృష్టించింది. కాలకృత్యాల కోసం వెళ్లిన ఒక మహిళను తొండంతో కొట్టి చంపింది. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది.

tt

జిల్లా సరిహద్దులో తిరుగుతున్న ఒక ఆడపులి, దాని రెండు పిల్లలను పట్టుకోవడానికి ఇటీవల సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. ఆడపులిని బతికి ఉండానైనా పట్టుకోవాలని, వీలుకాకపోతే చంపేయొచ్చని పేర్కొంది. దీంతో అధికారులు వేట ప్రారంభించారు. పులి ఆచూకీ కనిపెట్టడానికి నియమించిన  ఐదు ఏనుగుల్లో గిరిరాజ్ అనే మగ ఏనుగు గొలుసు తెంచుకుని పారిపోయింది. రాలేగావ్ తహహీల్లోలని చాహంద్ గ్రామంలో అర్చాన కుండ్సాంగే అనే మహిళను చంపేసింది. 20 కి.మీ. పారిపోయి మరో వ్యక్తిని గాయపరించింది. విషయం తెలుసుకున్న అధికారులు దాన్ని ఎట్టకేలకు నిర్బంధించారు. గిరిరాజ్ గతంలో కూడా మనుషులపై దాడి చేసిందని, అలాంటిదాన్ని ఆపరేషన్లో ఏలా చేర్చుకుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆడపులి కోసం 200 మంది పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, రాటుదేలిన షూటర్లు జల్లెడ పడుతున్నా ఫలితం కనిపించడం లేదు. ఆ పులి గత నవంబరు నుంచి ఇప్పటివరకు ఆరుగురిని పొట్టనబెట్టుకుంది.