జెనీలియా దంపతుల ఔదార్యం.. - MicTv.in - Telugu News
mictv telugu

జెనీలియా దంపతుల ఔదార్యం..

August 13, 2019

బాలీవుడ్‌ దంపతులు జెనీలియా, రితేష్‌ దేశ్‌ముఖ్‌ తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసందే. దీంతో వరద బాధితులకు అండగా నిలిచేందుకు వీరు ముందుకు వచ్చారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. 

సోమవారం సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను కలిసి చెక్కు అందజేశారు. ఈ నేపథ్యంలో ఫడణవీస్‌ ట్విటర్‌ వేదికగా జెనీలియా, రితేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఫడణవీస్‌ ట్వీట్‌కు రితేష్‌ దేశ్‌ముఖ్ స్పందించారు. ఈ మేరకు రితేష్ ట్వీట్ చేస్తూ.. ‘వరదల కారణంగా గత కొన్ని రోజులుగా మహారాష్ట్రతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలకు సంబంధించిన వార్తలు మా మనసును చలింపజేశాయి. సోమవారం ఉదయం సీఎంను కలసి దేశ్‌ ఫౌండేషన్‌ తరఫున విరాళం అందించాం. ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేసి, బాధితులను ఆదుకోవాలని కోరుతున్నా. మనమంతా కలిస్తే ఎంతో సాధించొచ్చు. థాంక్స్‌ దేవేంద్ర ఫడణవీస్‌ జీ’ అని పేర్కొన్నారు.