పక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకూ భారీ కోత  - MicTv.in - Telugu News
mictv telugu

పక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకూ భారీ కోత 

March 31, 2020

Maharashtra government employees salaries cut 

కరోనా లాక్‌డౌన్‌తో ఖజానాపై భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు కత్తెరవేయడం తెలిసిందే. అందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు తప్పవని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. ఆయన బాటలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా కత్తెరకు పనిచెప్పారు. 

 ప్రభుత్వ ఉద్యోగుల వేతలనాలను 60 శాతం ననుంచి 25 వరకు తగ్గిస్తున్నాట్లు ఠాక్రే ప్రభుత్వం చెప్పింది. సీఎం సహా పలువురు ఉద్యోగుల జీతాలు 60 శాతం తగ్గుతాయి. క్లాస్ ఎ, క్లాస్ బీ ఉద్యోగుల జీతాలకు 50 శాతం కోత పడుతుంది.   క్లాస్ సి ఉద్యోగుల జీతాలు 25 శాతం తగ్గుతాయి. క్లాస్ డీ ఉద్యోగుల జీతాలకు మాత్రం కత్తెరపడదు. కాగా, ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలగా జీతం ఇస్తారు. కరోనా విపత్తు కారణంగా మార్చి నెల జీతాన్ని రెండు విడతలగా ఇస్తామని సీఎం చెప్పినట్లు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. అయితే తెలంగాణలో మాదిరి ఏపీలోనూ ఉద్యోగుల జీతాలకు కోత పడుతుందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.