‘మహా’ అనూహ్యం.. ఎన్సీపీకి గవర్నర్ ఆహ్వానం  - MicTv.in - Telugu News
mictv telugu

‘మహా’ అనూహ్యం.. ఎన్సీపీకి గవర్నర్ ఆహ్వానం 

November 11, 2019

మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి సంఖ్యాబలం లేకపోవడంతో శివసేన.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి యత్నిస్తున్న సమయంలో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఊహించన షాకిచ్చారు. సర్కారును మీరు ఏర్పాటు చేయండంటూ శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీని ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేనకు ఇచ్చిన గడువు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ముగియగానే ఎన్సీపీకి గవర్నర్ ఈ ఆఫర్ ఇచ్చారు. 24 గంటల్లోగా సంఖ్యాబలంతో సర్కారును ఏర్పాటు చేయాలన్నారు. 

Maharashtra governor.

ఇటీవలి ఎన్నికల్లో  105 స్థానాలు సాధించిన బీజేపీని గవర్నర్‌ సంప్రదాయం ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. శివసేనతో వాటా పంచాయతీ తెగకపోవడంతో బీజేపీ చేతులెత్తేసింది. తర్వాత గవర్నర్ రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ఆహ్వానించారు. సేనకు 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తమకు మరింత గడువు కావాలని సేన కోరగా గవర్నర్ నిరాకరించి,  మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీపీని ఆహ్వానించారు. ఎన్సీపీ 54 స్థానాల్లో గెల్చింది. 288 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 ఎమ్మెల్యేల మద్దతు కావాలి. కాంగ్రెస్‌ 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.