రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర రాజకీయం! - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర రాజకీయం!

November 12, 2019

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వైపు అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ సిఫార్సు చేశారని తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాశారు. నిన్న ఎన్సీపీ, కాంగ్రెస్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన శివసేనకు కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని త్వరగా చెప్పకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాన్ని కోల్పోయింది. 

మరికొంత సమయం కావాలని శివసేన అడిగినా గవర్నర్ ఒప్పుకోలేదు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యమని మూడో అతిపెద్ద పార్టీ ఎన్సీపీని ఆహ్వానించడం జరిగిపోయాయి. ఇక ఈరోజు రాత్రి 8.30 లోపు ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యగలగాలి. అయితే ఇప్పటివరకు ఎన్సీపీ కూడా ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాలు చూస్తే.. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్లు 288 ఉన్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44, ఇతరులు 29 సీట్లు గెలుపొందారు. ఎవ్వరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హాంగ్ ఏర్పడింది.