మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే

November 26, 2019

Maharashtra Govt Formation LIVE Updates kalidas kolambakar appointed as assembly protem speaker

మహారాష్ట్ర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవర్ రాజీనామా చేశారు. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలనిరూపణ జరుగనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా వాడాలా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కోలంబకర్ నియమితులయ్యారు. ఈరోజు రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కాళీదాసును ప్రొటెం స్వీకర్‌గా నియమించారు. 

ఈయన వాడాలా నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపొందారు. ఈరోజు రాజ్ భవన్‌లో అసెంబ్లీ ప్రొటెం స్వీకర్‌గా కోలంబకర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రొటెం స్వీకర్‌గా కోలంబకర్ ఎన్నికైన మిగతా 287 ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తరువాత బాల నిరూపణ పరీక్ష నిర్వహిస్తారు.