మహారాష్ట్ర రాజకీయం..పదవుల లెక్క తేలింది! - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్ర రాజకీయం..పదవుల లెక్క తేలింది!

November 27, 2019

Maharashtra govt formation Sena gets CM+15, NCP Dy CM+13, Congress Speaker+13

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైనది. ఈ క్రమంలో ‘మహా వికాస్‌ అఘాడీ’ కూటమిలో మంత్రి పదవుల పంపకాలు దాదాపు పూర్తయ్యాయి. శివసేన 16, ఎన్సీపీ 15, కాంగ్రెస్‌ 13 మంత్రి పదవులను పంచుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఉపముఖ్యమంత్రి, స్పీకర్‌ పదవులపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొదట స్పీకర్‌ పదవి తమకు ఇవ్వాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేయగా.. శివసేన సర్దిచెప్పింది. దీంతో స్పీకర్ పదవి ఎన్సీపీకి దక్కనుంది. తదనంతరం స్పీకర్‌ పదవికి బదులుగా 13 మంత్రి పదవులు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. డిప్యూటీ సీఎం పదవి విషయానికి వస్తే.. శరద్‌ పవార్‌ శిబిరానికి తిరిగొచ్చిన అజిత్‌ పవార్‌కే మళ్లీ ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. అలాగే గురువారం సాయంత్రం 6 గంటలకు దాదర్‌లోని శివాజీ పార్క్‌లో జరిగే ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించారు.