Maharashtra king Sivaji descendant shambhaji reje meets Telangana chief minister kcr
mictv telugu

తెలంగాణ పథకాలు దేశమంతా కావాలి.. శివాజీ వారసుడు

January 26, 2023

Maharashtra king Sivaji descendant shambhaji reje meets Telangana chief minister kcr

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశమంతా అమలు చేస్తే బావుంటుందని ఛత్రపతి శివాజీ వంశ వారసుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజే అన్నారు. ఆయన గురువారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమై పలు ప్రాంతీయ, జాతీయ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను మహారాష్ట్ర సహా దేశ వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశప్రజల అభ్యున్నతి కోసం, దేశ సమగ్రత కోసం, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వినూత్న ఎజెండా ప్రజలముందుకు రావాల్సిన అవసరమున్నదని వారిరువురు అభిప్రాయపడ్డారు. శివాజీ నుంచి సాహూ మహారాజ్ దాకా ఈ దేశానికి వారందించిన సేవలను స్మరించుకున్నారు. సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా వారందంచిన పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని కేసీఆర్ అభిప్రాయ పడ్డారు. వారి స్పూర్తి తోనే, కుల మత వివక్షకు తావు లేకుండా తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతుందని వివరించారు. ‘రాజర్షి సాహు ఛత్రపతి’ పుస్తకాన్ని ఛత్రపతి శంభాజీ కేసీఆర్‌కు అందించారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.