దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వరద నీరు చేరడంతో చెరువులు, నదులు, ప్రాజెక్టులు పొంగిపోర్లుతున్నాయి. ఈ సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల న్యూస్ కవరేజి కోసం వెళ్లిన ప్రముఖ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ నీటి ప్రవాహంలో చిక్కుకొని, వరద ఉదృతికి కొట్టుకుపోయి, మరణించాడు. కానీ మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి ప్రాణాలనే కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
మాలేగావ్ లో ఉన్న గిర్నా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. స్థానికుడు 23 ఏళ్ల నయీమ్ అమీన్ అనే యువకుడు అందరూ చూస్తుండగానే.. నదిలోకి ఒక్కసారిగా దూకాడు. బ్రిడ్జ్ మీద ఉన్న వారు.. ఎంత సేపు చూసిన ఆ యువకుడు తిరిగి ఒడ్డుకు చేరుకోలేదు. సమాచారం అందుకున్న అధికారులు యువకుడి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు అమీన్‌ను గురువారం రాత్రి వెతికారు.. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. అయితే అమీన్ ఆత్మహత్య చేసుకోవడానికి నదిలో దూకాడా లేక ఈత కొడదామని దూకి గల్లంతయ్యాడా అన్న విషయం తెలియాల్సి ఉంది.
मालेगाव, नाशिक : स्टंटबाजी करत तरुणाने गिरणा पुलावरुन नदीत मारली उडी; बेपत्ता तरुणाचा शोध सुरु…#Nashik #Malegaon #HeavyRain #Stunt #ViralVideo
Video Credit: Abhijeet Sonawane pic.twitter.com/zB3HgUIQEW
— Akshay Baisane (अक्षय बैसाणे) (@Baisaneakshay) July 14, 2022