కరెంట్ కోత.. వెంటిలేటర్ పనిచేయక పేషెంట్ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

కరెంట్ కోత.. వెంటిలేటర్ పనిచేయక పేషెంట్ మృతి

June 3, 2022

ఊపిరితిత్తుల వ్యాధితో గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న ఓ వ్యక్తి.. తన ఇంట్లో వెంటిలేటర్ సపోర్ట్ మీద చికిత్స పొందుతున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో కరెంట్ కోతల కారణంగా వెంటిలేటర్ పనిచేయకపోవడంతో గురువారం మరణించాడు. మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. జిల్లాలోని ఉచ్గావ్ గ్రామంలో అమేష్ కాలే(38) అనే రోగిని కుటుంబసభ్యులు.. అతడిని ఇంట్లో వెంటిలేటర్పై ఉంచారు. వారు ఉన్న ప్రాంతానికి మే 30న విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయినా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు కుటుంబసభ్యులు. కొన్ని రోజులు పనిచేసిన వెంటిలేటర్.. గురువారం పనిచేయలేదు. దీంతో అతడు ఊపిరాడక మరణించాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.