అయోధ్య కేసుపై ఫేస్‌బుక్‌లో పోస్ట్.. అరెస్ట్..  - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య కేసుపై ఫేస్‌బుక్‌లో పోస్ట్.. అరెస్ట్.. 

November 9, 2019

Maharashtra

అయోధ్య వివాదంపై సంయమనం పాటించాలని, బహిరంగంగానే కాదు, సోషల్ మీడియాలోనూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని పోలీసులు కొన్ని రోజులుగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందిన 56 ఏళ్ల సంజయ్ రామేశ్వర్ శర్మ దీన్ని పట్టించుకోలేదు.  కేసుపై తీర్పు రాకముందే శుక్రవారం ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్ట్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పుతో చరిత్రపై పడిన మచ్చ పోతుందని, తాను దీపావళి జరుపుకుంటానని అన్నాడు.ఇది పోలీసులు దృష్టికి వచ్చింది. ఐపీ అడ్రస్ ద్వారా అతడు ఓల్డ్ ఆగ్రా రోడ్డలో నివసిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విద్వేషాలు రెచ్చగొడుతున్నరంటూ ఆయనపై ఐపీసీ 153 (1) (B), 188 కింద కేసు పెట్టారు. శర్మ ఓ యువకుడి ప్రేమ వ్యహారంలో జోక్యం చేసుకుని అతణ్ని కొట్టాడని, గతంలో అతనిపై రెండు కేసులు నమోదయ్యాయి.