మహారాష్ట్ర మంత్రి మూడు నెలల జైలు శిక్ష.. కేసు ఇదే - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్ర మంత్రి మూడు నెలల జైలు శిక్ష.. కేసు ఇదే

October 16, 2020

NVMHVHM

మహారాష్ట్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి యశోమతీ ఠాకుర్‌కు మూడు నెలల జైలు శిక్ష పడింది. అమరావతి జిల్లా సెషన్సు గురువారం ఈ తీర్పును వెల్లడించింది. ఎనిమిదేళ్ల క్రితం నాటి కేసులో ఈ శిక్ష ఖరారు చేసింది. ఆమెకు సాధారణ జైలు శిక్ష విధంగా, డ్రైవర్‌కు రూ.15,500 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో నెల రోజులు ఎక్కువగా జైలులో ఉండాలని ఆదేశించింది. మంత్రికి జైలు శిక్ష పడటంతో విపక్ష బీజేపీ ఆమె రాజీనామాకు డిమాండ్ చేస్తోంది. 

టివ్సా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యశోమతి ఠాకూర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. 2012 మార్చి 24న అమరావతి నగరంలో శ్రీ అంబదేవి ఆలయానికి వెళ్లినప్పుడు పోలీసులతో గొడవ జరిగింది. ఆమె కారును అడ్డుకోవడంతో కోపంతో చెంపదెబ్బ కొట్టారు. వివాదం పెద్దది కావడంతో ఆమె కారు డ్రైవర్ అమిత్ కూడా దాడి చేశాడు. అప్పుడు నమోదైన కేసు విచారణ తుది దశకు రావడంతో ఆమెను కోర్టు దోషిగా తేల్చింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడాన్ని తప్పుబట్టింది. అయితే ఈ తీర్పుపై యశోమతి స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని అన్నారు. దీనిపై ముంబై హైకోర్టును ఆశ్రయిస్తాయనని తెలిపారు.