నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలేకు పెను ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సూప్రియా సూలే చీరకు మంటలు అంటుకున్నాయి. అయితే మంటను సకాలంలో ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. రామతి ఎంపీ కరాటే పోటీని ప్రారంభించేందుకు హింజావాడిలో జరిగిన కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న విగ్రహానికి పూలమాల వేస్తుండగా ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి. క్షేమంగా ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూలే ఒక ప్రకటనలో తెలిపారు.
पुण्यातल्या सार्वजनिक कार्यक्रमात दीप प्रज्वलन करताना खासदार @supriya_sule यांच्या साडीने पेट घेतला. मात्र सुदैवानं साडी तातडीनं विझवण्यात आली. हा व्हिडीओ बघून व्यासपीठावर दिवे ठेवताना काळजी घेणं किती गरजेचं आहे हे दिसतंय. #Pune pic.twitter.com/hNNodJhMst
— Abhijit Karande (@AbhijitKaran25) January 15, 2023
ఎన్సీపీ నేత శివాజీ విగ్రహానికి పూలమాల వేసేటప్పుడు అనుకోకుండా టేబుల్‌పై ఉంచిన దీపంపై చీర పడడంతో మంటలు అంటుకున్నాయి. “కరాటే పోటీ ప్రారంభోత్సవంలో నా చీరకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. అయితే సకాలంలో మంటలు ఆర్పివేయబడ్డాయి. నేను క్షేమంగా ఉన్నందున శ్రేయోభిలాషులు, పౌరులు, పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ ఆందోళన చెందవద్దని అభ్యర్థన” అని సూలే ఒక ప్రకటనలో తెలిపారు.